Friday, 25 November 2016

బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవడం సులభం

* బ్యాంక్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలని టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే ఆప్షన్లు నొక్కండంటూ సమయాన్ని వృథా చేస్తుంది. 
* ఈ తల నొప్పుల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త నంబర్‌ను ప్రవేశ పెట్టింది. 
* ఈ నంబర్‌కు డయల్‌ చేసి ఖాతాల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో సులభంగా తెలుసు కోవచ్చు. 
* దీనికి ఇంటర్‌ నెట్‌తో కూడా పనిలేదు.
రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేసిన తరుణంలో మన బ్యాంకు అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడా నికి చాలా కష్టపడాల్సి వస్తోంది.
నోట్లు మార్చుకు నేందుకు ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారు లు తీరి ఉంటున్నారు.
సాంకేతిక సమస్య తో ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. చాలా మంది తమ వద్ద ఉన్న పాతనోట్లను పెద్దమొత్తం లో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేస్తున్నారు.
అకౌంట్‌లో సొమ్ము పడిందో లేదో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియక తికమకపడుతున్నారు. చెక్కులు జారీ చేయాలన్నా, ఏదైనా కొనాలన్నా, ఏటీఎం ద్వారా మనీ డ్రా చేయాలన్నా ముందు బ్యాంకు అకౌంట్‌ లో ఎంత డబ్బు ఉందో తెలియాల్సి ఉంది.
ఏ నంబరుకు కాల్‌ చేస్తే బ్యాలెన్స తెలుస్తుందో సందే హం కూడా చాలామందికి ఇప్పటికీ ఉంది.
తీరా ఆ నంబరు దొరికిన తరువాత కాల్‌ చేస్తే ఆప్షన్లు నొక్కండంటూ సమయాన్ని వృథా చేస్తాయి.
ఈ తలనొప్పుల నుంచి ఖాతా దారులను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఓ కొత్త నంబర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ నం బర్‌కు డయల్‌ చేస్తే క్షణాల్లో ఖా తాల్లో బ్యాలెన్స ఎంత ఉందో సుల భంగా తెలు సుకోవచ్చు.
దీనికి ఇంటర్‌నెట్‌తో కూ డా పనిలేదు. బ్యాంక్‌ అకౌంట్‌లో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నుంచి స్టార్‌ 99 యాష్‌కు డయల్‌ చేస్తే చాలు.
ఈ నంబరుకు డయల్‌ చేసిన వెంటనే మీ స్ర్కీనపై మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
మీ బ్యాంక్‌ అకౌంట్‌ నంబరులోని ఏవైనా మూడు అక్షరాలు గాని, నంబర్లు గాని టైప్‌ చేయాలి.
బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లో మొదటి నాలుగు అక్షరాలు టైప్‌ చేయాలి.
బ్యాంక్‌ రెండు డిజిట్‌ కోడ్‌‌ను టైప్‌ చేయాలి.
ఈ వివరాలు ఇచ్చిన తరువాత ఫోన్ స్ర్కీన్‌పై మరికొన్ని ఆప్షన్స కనిపిస్తాయి.
ఇందులో మొదటిది బ్యాంక్‌ బ్యాలెన్స్ ఆప్షన్ అని ఉంటుంది.
రెండవది మినీస్టేట్‌మెంట్‌ ఇలా మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
వీటిలో ఒకటో నంబరును ఎంటర్‌ చేయగానే మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో మొబైల్‌లో ప్రత్యక్షమవు తుంది.
బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన మరికొన్ని ఆప్షన్లు కూడా నంబర్ల రూపంలో ఉంటాయి.
కావాల్సిన నంబరును ఎంచుకుని రిప్లై ఇస్తే వెంటనే అకౌంట్‌ నంబరుతోపాటు బ్యాంక్‌ బ్యాలెన్స్ తదితర వివరాలు కనిపిస్తాయి.
ఇలా చాలా సులభంగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకునే వీలు రిజర్వు బ్యాంకు ఖాతాదారులకు కల్పించింది.

No comments:

Post a Comment