Sunday 27 August 2017

Live Updates: Nandyal ByPolls Results

Live Updates: Nandyal ByPolls Results: The high-staked byelection in Nandyal ended with a massive voter turnout on Wednesday, leaving the ruling and opposition parties and poll pundits brooding over the outcome. Check here for live coverage of NandyalByPoll Results

Thursday 29 December 2016

Xiaomi Redmi Note 4X

EXPECTED PRICE: ₹ 13,999

Launch Date: 31st March 2017



  • Xiaomi Redmi Note 4X runs Android 6.0 Marshmallow
  • The smartphone has a 5.5-inch Full HD IPS display
  • It has dual 13MP rear cameras with a dual-tone LED flash and a 5MP front-facing camera
  • The device is powered by a Snapdragon 653 processor and 4GB RAM
  • It has 32GB internal storage which can further be expanded via a microSD card
  • Connectivity options include 4G, Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 4.1, GPS, and a microUSB 2.0 port
  • The device is powered by a Li-Ion 4,100 mAh battery


Xiaomi Redmi Note 4X Unique Features...

Display:  5.5-inch Full HD IPS display.
Camera: Dual 13MP Rear Camera, 5MP front-facing camera.
RAM:     4GB RAM.
Android: 6.0 Marshmallow.
Storage: 32GB internal storage which can further be expanded via a microSD card.
Battery: 4,100mAh Battery.


షియోమి నుంచి కొత్త ఫోన్

"రెడ్‌ ఎంఐ నోట్4 ఎక్స్" పేరుతో షియోమి నుంచి కొత్త ఫోన్

'రెడ్ ఎంఐ నోట్4 ఎక్స్' పేరుతో షియోమి మొబైల్ సంస్థ విపణిలోకి తీసుకురానుంది. నోట్ 4 కు స్వల్ప మార్పులతో 'నోట్ 4 ఎక్స్' పేరుతో మరో స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేయనుంది. ధర మాత్రం రూ.15 వేల వరకు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
















షియోమి రెడ్ ఎంఐ నోట్4 ఎక్స్ ఫీచర్లు....

స్ర్కీన్: 5.5 అంగుళాల టచ్ స్క్రీన్
కెమెరా: 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.
రిజల్యూషన్: 1080x1920 రెసల్యూషన్.
ఆండ్రాయిడ్: 6.0.1 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్.
ర్యామ్: 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.
బ్యాటరీ: 4100mAh బ్యాటరీ సామర్థ్యం.




Sunday 27 November 2016

మీరు పుట్టిన నెలను బట్టి మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది...?

మీరు పుట్టిన నెలను బట్టి మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ?

👉 మనం పుట్టిన నెల మన గురించి చాలా చెబుతుంది. 
👉 మనం ఏంటి,మనం ఏ విషయాలను ఇష్టపడతాం, మన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలను వివరిస్తుంది.
👉 ఒక వ్యక్తి క్యారెక్టర్ ని.. వాళ్లు పుట్టిన నెలను బట్టి తెలుసుకోవడం న్యూమరాలజీలో భాగం.
👉 అయితే... చాలా మంది సైంటిస్ట్ లు... ఒక వ్యక్తి జీవితంలో...లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని పుట్టిన నెలను బట్టి తెలుసుకోవచ్చని నిరూపిస్తున్నారు. 
👉 మరి మీరు పుట్టిన నెల మీ లవ్ లైఫ్ ని ఎలా వివరిస్తుంది. 
 👉 మీరు ఏ నెలలో పుట్టారో దాన్ని బట్టి తెలుసుకోండి...

🌟 జనవరి

జనవరిలో పుట్టినవాళ్లు ఇండిపెండెంట్ గా ఉంటారు. 
లీడర్స్ గా పుడతారు. 
వీళ్లు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. 
ఇతరులు ఎలాంటి సందేహం లేకుండా వీళ్లను ఫాలో అవుతారు. 
వీళ్లు మనుషుల తప్పులను, బలహీనతలను చూడరు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు.

🌟  ఫిబ్రవరి

ఫిబ్రవరిలో పుట్టినవాళ్లు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. 
చాలా సిగ్గు కలిగి ఉంటారు. 
అలాగే నిజాయితీగా, గౌరవంగా ఉంటారు. 
చాలా రొమాంటిక్ గా ఉంటారు.

🌟 మార్చ్

మార్చిలో పుట్టినవాళ్లు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. 
చాలా సిగ్గుతో, ప్రేమ కలిగి ఉంటారు. 
కాస్త నిర్మొహమాటం ఎక్కువ చాలా నిజాయితీగా ఉంటారు.

🌟 ఏప్రిల్

ఏప్రిల్ లో పుట్టినవాళ్లు డైనమిక్ అండ్ యాక్టివ్ గా ఉంటారు.
వీళ్లు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. 
వాళ్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి స్నేహితులు కావాలి.

🌟 మే

మేలో పుట్టిన వాళ్లు వాళ్ల స్వంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 
కాబట్టి వీళ్లు మ్యుజిషీయన్స్, యాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ కష్టపడతారు. 
కుటుంబాన్ని ప్రేమిస్తారు ఎక్కువ మంది పిల్లలు ఉండటాన్ని ఇష్టపడరు.

🌟 జూన్

జూన్ లో పుట్టిన వాళ్లు చాలా అసూయ కలిగి ఉంటారు. 
కానీ చాలా రొమాంటిక్ గా ఉంటారు. 
వీళ్లు ఫెంటాస్టిక్ లవర్స్, చాలా సాన్నిహిత్యంగా ఉంటారు.

🌟 జూలై

జూలైలో పుట్టిన వాళ్లు చాలా జాలి కలిగి నిజాయితీగా ఉంటారు. 
వాళ్ల రిలేషన్స్ బాగా కాపాడుకుంటారు. 
వీళ్లను అర్థం చేసుకోవడం కష్టం. 
ఒకసారి హర్ట్ అయ్యారంటే రికవర్ అవడానికి సమయం పడుతుంది.

🌟 ఆగస్ట్

ఆగస్ట్ లో పుట్టినవాళ్లు సమాజానికి పిల్లర్స్ లాంటి వాళ్లు. 
ఇతరులను ప్రోత్సహిస్తారు. 
తేలికగా డబ్బు సంపాదిస్తారు. 
చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. 
అలాగే రొమాంటిక్, కేరింగ్, లవింగ్ గా ఉంటారు.

🌟 సెప్టెంబర్

సెప్టెంబర్ లో పుట్టినవాళ్లు చాలా తెలివైనవాళ్లు వీళ్ల పెద్ద వీక్ నెస్ డిప్రెషన్. 
వీళ్లు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు. 
చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. 
చాలా నిజాయితీగా, సెన్సిటివ్ గా, నాలెడ్జ్ కలిగి ఉంటారు. 
సీక్రెట్స్ దాచుకుంటారు ఫీలింగ్స్ ని చెప్పరు.

🌟 అక్టోబర్

అక్టోబర్ లో పుట్టినవాళ్లు చాలా లక్కీ పర్సన్స్ వాళ్ల లక్ష్యాలను సాధిస్తారు. 
చాలా ఎమోషనల్ గా ఉంటారు. 
ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు, ఇష్టపడతారు అలాగే వాళ్ల నుంచి కూడా అదే కోరుకుంటారు. 
కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు.

🌟 నవంబర్

నవంబర్ లో పుట్టినవాళ్లు శారీరక ఎట్రాక్షన్ కలిగి ఉంటారు. 
కొన్ని సార్లు చాలా సెన్సిటివ్ ఫీలై  ఒత్తిడికి గురవుతారు. 
వీళ్లు చాలా తెలివైనవాళ్లు, చాలా షార్ప్ గా ఆలోచిస్తారు. 
వీళ్ల ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు చాలా రొమాంటిక్ గా ఉంటారు.

🌟 డిసెంబర్

డిసెంబర్ లో పుట్టినవాళ్లు ఫిలాసఫర్స్ అవుతారు. 
చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు. 
ఓర్పు తక్కువ పొగడ్తలను ఇష్టపడతారు.



























Friday 25 November 2016

బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవడం సులభం

* బ్యాంక్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలని టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే ఆప్షన్లు నొక్కండంటూ సమయాన్ని వృథా చేస్తుంది. 
* ఈ తల నొప్పుల నుంచి ఖాతాదారులను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త నంబర్‌ను ప్రవేశ పెట్టింది. 
* ఈ నంబర్‌కు డయల్‌ చేసి ఖాతాల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో సులభంగా తెలుసు కోవచ్చు. 
* దీనికి ఇంటర్‌ నెట్‌తో కూడా పనిలేదు.
రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేసిన తరుణంలో మన బ్యాంకు అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడా నికి చాలా కష్టపడాల్సి వస్తోంది.
నోట్లు మార్చుకు నేందుకు ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారు లు తీరి ఉంటున్నారు.
సాంకేతిక సమస్య తో ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. చాలా మంది తమ వద్ద ఉన్న పాతనోట్లను పెద్దమొత్తం లో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేస్తున్నారు.
అకౌంట్‌లో సొమ్ము పడిందో లేదో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియక తికమకపడుతున్నారు. చెక్కులు జారీ చేయాలన్నా, ఏదైనా కొనాలన్నా, ఏటీఎం ద్వారా మనీ డ్రా చేయాలన్నా ముందు బ్యాంకు అకౌంట్‌ లో ఎంత డబ్బు ఉందో తెలియాల్సి ఉంది.
ఏ నంబరుకు కాల్‌ చేస్తే బ్యాలెన్స తెలుస్తుందో సందే హం కూడా చాలామందికి ఇప్పటికీ ఉంది.
తీరా ఆ నంబరు దొరికిన తరువాత కాల్‌ చేస్తే ఆప్షన్లు నొక్కండంటూ సమయాన్ని వృథా చేస్తాయి.
ఈ తలనొప్పుల నుంచి ఖాతా దారులను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఓ కొత్త నంబర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ నం బర్‌కు డయల్‌ చేస్తే క్షణాల్లో ఖా తాల్లో బ్యాలెన్స ఎంత ఉందో సుల భంగా తెలు సుకోవచ్చు.
దీనికి ఇంటర్‌నెట్‌తో కూ డా పనిలేదు. బ్యాంక్‌ అకౌంట్‌లో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నుంచి స్టార్‌ 99 యాష్‌కు డయల్‌ చేస్తే చాలు.
ఈ నంబరుకు డయల్‌ చేసిన వెంటనే మీ స్ర్కీనపై మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
మీ బ్యాంక్‌ అకౌంట్‌ నంబరులోని ఏవైనా మూడు అక్షరాలు గాని, నంబర్లు గాని టైప్‌ చేయాలి.
బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లో మొదటి నాలుగు అక్షరాలు టైప్‌ చేయాలి.
బ్యాంక్‌ రెండు డిజిట్‌ కోడ్‌‌ను టైప్‌ చేయాలి.
ఈ వివరాలు ఇచ్చిన తరువాత ఫోన్ స్ర్కీన్‌పై మరికొన్ని ఆప్షన్స కనిపిస్తాయి.
ఇందులో మొదటిది బ్యాంక్‌ బ్యాలెన్స్ ఆప్షన్ అని ఉంటుంది.
రెండవది మినీస్టేట్‌మెంట్‌ ఇలా మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
వీటిలో ఒకటో నంబరును ఎంటర్‌ చేయగానే మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో మొబైల్‌లో ప్రత్యక్షమవు తుంది.
బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన మరికొన్ని ఆప్షన్లు కూడా నంబర్ల రూపంలో ఉంటాయి.
కావాల్సిన నంబరును ఎంచుకుని రిప్లై ఇస్తే వెంటనే అకౌంట్‌ నంబరుతోపాటు బ్యాంక్‌ బ్యాలెన్స్ తదితర వివరాలు కనిపిస్తాయి.
ఇలా చాలా సులభంగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకునే వీలు రిజర్వు బ్యాంకు ఖాతాదారులకు కల్పించింది.

Tuesday 22 November 2016

ఈ ప‌దార్థాల‌ను తీసుకుంటే ఎంత‌టి హైబీపీ అయినా అదుపులోకి వ‌స్తుంది.

(ర‌క్త‌పోటు) బీపీ ఉంటే అది మ‌న‌కు ఎంత‌టి అన‌ర్థాల‌ను క‌లిగిస్తుందో అంద‌రికీ తెలిసిందే.
దాంతో మ‌న శ‌రీరానికి క‌లిగే న‌ష్టం అంతా ఇంతా కాదు.
ప్ర‌ధానంగా గుండె సంబంధ వ్యాధులు త్వ‌ర‌గా వ‌స్తాయి.
ఒకానొక ద‌శ‌లో హార్ట్ ఎటాక్ కూడా రావ‌చ్చు.
అంత‌టి ప్రాణాంత‌క ప‌రిస్థితిలోకి (ర‌క్త‌పోటు) బీపీ మ‌న‌ల్ని నెట్టివేస్తుంది.
బీపీ ఉంద‌ని తేలితే వెంట‌నే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ప్రారంభించాలి.
ఈ క్ర‌మంలో అధికంగా ఉన్న బీపీని త‌గ్గించ‌డం కోసం మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టిపండు
* అర‌టిపండులో  పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల అర‌టిపండు బీపీని అదుపు చేయ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
* బీపీ బాగా ఉంటే వెంట‌నే ఒక అర‌టిపండును తినాలి దీంతో బీపీ అదుపులోకి వ‌స్తుంది.
* అంతేకాదు అర‌టిపండును నిత్యం ఆహారంతోపాటు తీసుకుంటుంటే బీపీ కూడా క్ర‌మంగా త‌గ్గుతుంది.
పుచ్చ‌కాయ విత్త‌నాలు
* (ర‌క్త‌పోటు) బీపీని నియంత్రించ‌డంలో పుచ్చ‌కాయ విత్త‌నాలు కూడా అద్భుతంగా ప‌నిచేస్తాయి.
* ప‌లువురు సైంటిస్టులు దీన్ని ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు కొన్ని పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను సేక‌రించి నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేయాలి.
* అనంత‌రం అంతే మొత్తంలో గ‌స‌గ‌సాల‌ను తీసుకుని పొడి చేసుకోవాలి.
* ఈ రెండింటినీ బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని నిల్వ చేసుకోవాలి.
* దీన్ని ఉద‌యం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీస్పూన్ చొప్పున తీసుకుని నీటిలో క‌లిపి తాగాలి.
బీపీ అదుపులోకి వ‌స్తుంది.
కొబ్బ‌రి నీళ్లు
* హైబీపీ ఉన్న‌వారు త‌మ శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.
* అందుకోసం వారు నిత్యం క‌నీసం 10 గ్లాసుల నీటినైనా తాగాలి.
* అయితే నీరు అందుబాటులో లేక‌పోతే కొబ్బ‌రి నీళ్లు అందుకు ప్ర‌త్యామ్నాయంగా ప‌నిచేస్తాయి.
* ఎందుకంటే పొటాషియం, మెగ్నిషియం, విట‌మిన్ సి వంటి పోష‌కాలు ఉన్నందున కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే శ‌రీరానికి నీరు అంద‌డ‌మే కాదు హై బీపీ వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది.

నిమ్మ‌ర‌సం
* నిమ్మ‌కాయ‌ల్లో సి విట‌మిన్ ఎక్కువ‌గా ఉంటుంది.
* యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్ కూడా ఎక్కువే.
* గుండెకు వెళ్లే ర‌క్త నాళాల‌ను మృదువుగా ఉండేలా చేస్తాయి వాటిలో ఏవైనా ప‌దార్థాలు ఆగిపోయి ఉంటే వాటిని తొల‌గించేందుకు దోహ‌ద‌ప‌డుతాయి.
* అంతేకాదు అధికంగా ఉన్న బీపీ కూడా నిమ్మ‌ర‌సం తాగితే వెంట‌నే త‌గ్గిపోతుంది.
* అందుకు ఏం చేయాలంటే ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో స‌గం నిమ్మ ముక్క‌ను పూర్తిగా పిండి అనంత‌రం ఆ నీటిని తాగాలి దీంతో బీపీ డౌన్ అవుతుంది.
* దీన్ని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగుతుంటే బీపీ క్ర‌మంగా అదుపులోకి వ‌స్తుంది.

ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు
* పీచు ప‌దార్థం, పొటాషియం, విట‌మిన్ సి, మెగ్నిషియం వంటి కీల‌క పోష‌కాలు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో ఉంటాయి.
* ఇవి గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చూస్తాయి బీపీని నియంత్రిస్తాయి.
* నిత్యం ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

వెల్లుల్లి
* గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చూడ‌డంలో వెల్లుల్లి అమోఘంగా ప‌నిచేస్తుంది.
* ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది కొవ్వు క‌రిగేలా చేస్తుంది.
* నిత్యం 1, 2 వెల్లుల్లి రేకుల‌ను బాగా న‌లిపి 15 నిమిషాలు ఆగాక ప‌చ్చిగానే తినాలి.
* అలా తిన‌లేని వారు వాటిని పాల‌తోనూ తీసుకోవ‌చ్చు లేదంటే ఏదైనా కూర వండాక దాంట్లో క‌లుపుకుని తిన‌వ‌చ్చు.

బీన్స్‌
* పీచు ప‌దార్థం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోష‌కాలు బీన్స్‌లో ఉంటాయి.
* ఇవి హైబీపీని కంట్రోల్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
* బీన్స్‌ను త‌ర‌చూ తీసుకుంటూ ఉంటే బీపీ త‌గ్గుతుంది.